Sardaar Gabbar singh Director bobby Pawan kalyanవిమర్శల పాలైన “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా ట్రైలర్ కు జరిగిన డ్యామేజ్ ను చిత్ర యూనిట్ సరిదిద్దుకునే పనిలో పడింది. సహజంగా ఏ సినిమాకైనా ఆడియో వేడుక జరిగిన తర్వాత ఒక రేంజ్ లో హైప్ వస్తుంది. కానీ, ‘సర్ధార్’ ట్రైలర్ పుణ్యమా… అంతకు ముందు ఉన్న భారీ హైప్ కూడా ఒక్కసారిగా పడిపోయింది. దీంతో మరో ట్రైలర్ ను విడుదల చేసి అభిమానుల మెప్పు పొందాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

ఈ నెల 25వ తేదీన “ఊపిరి” సినిమాతో పాటు కొత్త ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతోందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత ట్రైలర్ దాదాపుగా 3 నిముషాల పాటు ఉండి ఆడియన్స్ కు బోరు కొట్టించడంతో, ఫ్రెష్ ట్రైలర్ నిముషంన్నర్ర లోపే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదటి ట్రైలర్ లోనే దాదాపుగా కధపై ఓ స్పష్టత వచ్చేయడంతో… తాజా ట్రైలర్ అయినా పవర్ స్టార్ అభిమానుల ఆదరణకు నోచుకుంటుందో లేదో చూడాలి.