sardaar gabbar singh music copied,తెలుగునాట ‘కాపీ’ అన్న పదానికి పేటెంట్ హక్కులు లేవు. వారు, వీరు అన్న తేడానే లేదు… కొందరు దానిని క్లాస్ గా ప్రేరణ… స్ఫూర్తి వంటి పేర్లు పెడతారు… మరికొందరు మాస్ గా కాపీ అంటారు. పిలవడంలోనే వ్యత్యాసం తప్ప మిగదంతా సేమ్ టు సేమ్. తాజాగా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాలో పాటలు కూడా కాపీ కాట్స్ అంటూ ప్రచారం జరుగుతోంది.

సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో అంతకు ముందు కంపోజ్ చేసిన ట్యూన్లు, ప్రస్తుత సర్ధార్ ట్యూన్లు వినిపించడంతో కాపీ అని ఒప్పుకోక తప్పని పరిస్థితి. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటంటే… అసలు కాపీ అని ఈ రచ్చ ప్రారంభం కావడానికి ముందే సదరు సంగీత దర్శకులు గానీ, సినిమా దర్శకులు గానీ ఈ విషయాన్ని ముందుగానే ప్రేక్షకులకు తెలియజేసినట్లయితే ఇంత చర్చకు అవకాశం ఉండేది కాదు.

ప్రేక్షకులు పిచ్చి వాళ్ళు తాము తెలివైన వాళ్లము అనే ఉద్దేశంతో కొందరు సినీ ప్రముఖులు ఉండడం వలనే ‘కాపీ’ అంటూ సంచలన రూపంలో బయటకు వస్తున్నాయి. నిజానికి ‘బిజినెస్ మెన్’ చిత్రంలో థమన్ కంపోజ్ చేసిన ఒక పాట ఇటలీ ట్యూన్ నుండి తీసుకున్నామని దర్శకుడు పూరీ జగన్నాధ్ ముందుగానే చెప్పేసారు. దీంతో విమర్శలకు అవకాశం లేకుండా చిత్ర యూనిట్ ముందుగా జాగ్రత్త పడ్డారు. అలా అందరూ బహిర్గతం చేయకుండా, ప్రేక్షకులు కనిపెట్టినపుడు బయట పెడదాంలే… అన్న ఆలోచనలు చేసినపుడే ఇలాంటి రచ్చకు దారి తీస్తోంది. అయితే, ఎంత కాపీ కొట్టినా ‘సర్ధార్’ పాటలకు సంగీత ప్రియుల నుండి అంతంత మాత్రపు ఆదరణే ఉంది.