sardaar-gabbar-singh-full-title-song-talkభారీ అంచనాలు ఒక్కోసారి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాయో గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. అదే కోవలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ పయనిస్తోందా… అంటే దానికి సమాధానం ఇప్పుడే చెప్పలేం గానీ… ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా..!

సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఆడియోపై కూడా అన్నే అంచనాలు ఉన్నాయి. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘గబ్బర్ సింగ్’లో ఆడియో కూడా కీలకపాత్ర పోషించడంతో తాజా చిత్రంలోని పాటలపై ప్రేక్షకులు భారీ స్థాయిలో ఊహించుకుంటున్నారు.

అయితే చిత్ర యూనిట్ ఈ తొలి పాటను యూట్యూబ్ లో విడుదల చేసింది. టైటిల్ సాంగ్ గా విడుదలైన ఈ పాట పవన్ అభిమానులను ఓ మోస్తరుగా ఆకట్టుకోవచ్చు గానీ, ఇటు సాధారణ ప్రేక్షకులను గానీ, సంగీత ప్రియులను గానీ ఆశించిన రీతిలో అలరించలేకపోతోంది. ముఖ్యంగా ఈ పాటలో పాత సినిమాలోని ట్యూన్ నే కాపీ కొట్టడంతో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో విడుదలైన తొలి పాట నిరాశను మిగిల్చింది.