sardaar-gabbar-singhపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా రికార్డుల మోత కొనసాగుతోంది. ఇప్పటికే ధియేటర్ హక్కులు భారీ మొత్తంలో అమ్ముడై సంచలనం సృష్టించగా, తాజాగా ఈ సినిమా ఆడియో ప్రసార హక్కులను ప్రముఖ ‘మా’ టెలివిజన్ భారీ మొత్తాన్ని వెచ్చించి సొంతం చేసుకుందని తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమాతో మొదలైన ఈ రికార్డును పవన్ అధిగమించాడని లేటెస్ట్ న్యూస్.

‘బాహుబలి’ ఆడియో ప్రసార హక్కులు దాదాపు కోటి రూపాయలు పలుకగా, ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ హక్కులు 1.25 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. టీఆర్పీ రేటింగ్స్ లో భాగంగా ఛానల్స్ మధ్య నెలకొన్న పోటీయే దీనికి కారణమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. హైదరాబాద్ లో జరగనున్న ఈ సినిమా ఆడియో వేడుకను అత్యంత వైభవంగా జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అభిమానులకు కిక్ ఇచ్చే విధంగా ఆడియో వేడుకను సన్నద్ధం చేయాలని పవన్ పలు సూచనలు చేసారట. అయితే ఆడియో వేడుక తేదీ మరియు వెన్యూలపై అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి…!