SARBJIT Theatrical Trailerఇప్పటివరకు పోస్టర్స్ తో సినీ ప్రేమికులలో ఆసక్తి రేపిన “సరబ్‌ జీత్” ట్రైలర్ వచ్చేసింది. ఐశ్వర్యరాయ్, రణదీప్ హుడాలు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ కు వీక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. సరబ్‌ జీత్ సోదరి దల్బీర్‌ కౌర్‌గా ఐష్… సరబ్‌జీత్ రోల్‌ లో రణదీప్ ఒదిగిపోయారు. దాదాపు మూడు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్లో… ఎమోషనల్ సీన్స్ ను కాస్త ఎక్కువగా చూపించిన దర్శకుడు ఒమాంగ్‌ కుమార్, జైలులో సరబ్‌జీత్ కు ఎదురైన అనుభవాలను కళ్లకు కట్టినట్టు చూపించడంలో విజయవంతం అయ్యారు.

పాకిస్థాన్ జైల్ లో శిక్ష అనుభవిస్తూ చనిపోయిన భారత ఖైదీ సరబ్‌ జీత్. 1990లో లాహోర్, ఫైసలాబాద్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లలో 14 మంది మృతికి సరబ్‌ జీత్ కారణమంటూ టెర్రరిస్ట్ అనే ముద్ర వేసింది అక్కడి న్యాయస్థానం. అంతేకాదు సరబ్‌ జీత్ ను భారత్ గూఢచారిగా పాక్ మీడియా ప్రస్తావించాయి. తన సోదరుడ్ని పాకిస్తాన్ జైలు నుంచి విడిచిపించేందుకు సోదరి దల్బీర్‌ కౌర్ చేయని ప్రయత్నాలు లేవు. జైల్లోనే తోటి ఖైదీలు సరబ్‌‌ జీత్‌ని కొట్టి చంపేశారు. అతని రియల్ స్టోరీ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా మే 20న రిలీజ్ చేయబోతున్నారు.