Sara Sari song Bheeshma Movieయంగ్ హీరో నితిన్ నటిస్తున్న భీష్మ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగించాయి. విడుదలైన రెండు పాటలు … సింగిల్స్ యాంతం, సరాసరి శ్రోతలను అలరించాయి.

మహతి స్వర సాగర్ మ్యూజిక్ డైరెక్టర్. తన మొదటి సినిమా ఛలో తో హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ… ఈ సినిమాతో ఇంకో హిట్ కొట్టాలని ఆరాటపడుతున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె గ్లామర్ సినిమాకే హైలైట్ అంటున్నారు. సరిలేరు నీకెవ్వరుతో స్టార్ లీగ్ లోకి వెళ్లిన ఈ భామ, ఈ సినిమాతో కూడా హిట్ కొడితే స్టార్ లీగ్ లో సెటిల్ అయిపోయినట్టే.

దీనితో ఈ సినిమా మీద నితిన్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. సంక్రాంతి సినిమాల హావా పూర్తయ్యాకా టాలీవుడ్ కు సరైన హిట్ రాలేదు. దానితో ట్రేడ్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఏప్రిల్ లో వివాహం చేసుకోబోతున్న నితిన్ కు తన బ్యాచిలర్ లైఫ్ లో ఇదే చివరి రిలీజ్. దీనితో ఆయన హిట్ తో ముగిస్తాడా అనేది చూడాలి.

నితిన్ ఈ మధ్య కాలంలో అభిమానులను నిరాశపరిచాడు. 2016లో వచ్చిన అ..ఆ తరువాత ఆయనకు సరైన హిట్ లేదు. వరుసగా మూడు సినిమాలు ప్లాపులుగా నిలిచాయి దీనితో ఎలాగైనా హిట్ కొట్టాలని దృఢనిశ్చయంతో ఉన్నాడు. ఇప్పటివరకు అన్నీ మంచి శకునాలే… ఆ ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉంటే నితిన్ పాత బాకీలు తీర్చేసినట్టే