Sara Ali Khan in Ranveer Singh Simbaa-టాలీవుడ్‌ లో మంచి విజయం సాధించి, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పిన ‘టెంపర్’ సినిమాను బాలీవుడ్ లో రణ్‌ వీర్‌ సింగ్‌ తో రోహిత్ శెట్టి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాత కరణ్ జోహర్ కావడంతో బాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

సోషల్ మీడియా సంచలనం ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుందంటూ ఇటీవల గతంలో పలు కధనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. వీటన్నింటినీ రూమర్స్ గా కొట్టిపడేసిన చిత్రయూనిట్ ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ను ఎంపిక చేసినట్టు ప్రకటించింది.

ఈ మేరకు రోహిత్‌ శెట్టి, కరణ్‌ జోహార్‌ లు ఆమెతో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కాగా సారా అలీఖాన్ ‘కేదార్‌ నాథ్‌’ సినిమాతో బాలీవుడ్‌ అరంగేట్రం చేయనుంది. సుశాంత్ సింగ్‌ రాజ్‌ పుత్‌ సరసన నటిస్తున్న సారా తొలి సినిమా ఇదైనప్పటికీ ముందుగా విడుదల కానుంది మాత్రం ‘సింబా’ కావడం విశేషం.