Sara Ali Khan Danceసాధారణంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ను ధరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల కాలంలో అయితే ఏకంగా స్విమ్ సూట్లతో దర్శనమిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ జాబితాలో సైఫ్ అలీఖాన్ తనయురాలు సారా అలీ ఖాన్ కూడా ఒకరు. తన హాట్ ఫోటోలతో నెటిజన్లలో క్రేజ్ తెచ్చుకున్న సారా, తాజాగా ఓ వివాహా వేడుకలో చీర కట్టుకుని వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

చీరలో ఉన్న అందం, ఆ హొయలు ఎలా ఉంటాయో చాటిచెప్పడానికి నిదర్శనంగా ఈ వీడియో నిలుస్తుందని చెప్పవచ్చు. వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ తో ఎంతగా అందాలు ఆరబోసినా, చీర కట్టు ముందు బలాదూర్ అనిపించే విధంగా ఉన్న సారా డ్యాన్స్ షోకు వీక్షకులే కాదు, అక్కడున్న వారంతా కూడా ఫిదా అయ్యి, చప్పట్లతో అభివాదాలు తెలిపారు. మరి ఈ స్టార్ వారసురాలి తెరంగ్రేటం ఎప్పుడు అవుతుందోనని బాలీవుడ్ కూడా ఎదురుచూస్తోంది.