Sanjay Dutt as Villain in Balakrishna - Boyapati Srinu Movieసింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. ఇప్పుడు వారి కాంబినేషన్ లో మూడవ సినిమా మొన్న ఆ మధ్య అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 20న మొదలు కాబోతుంది. 2020 వేసవి చివరి భాగంలో విడుదలకు సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ని సంప్రదించారని సమాచారం. ఇది చాలా పవర్ ఫుల్ పాత్ర అని తెలుస్తుంది. దత్ ఇప్పటికే కేజీఎఫ్ 2లో విలన్ గా నటిస్తున్నాడు.

2019లో ఇప్పటివరకు బాలయ్యకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ సంవత్సరం వచ్చిన ఎన్టీఆర్ చిత్రం రెండు భాగాలు బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అదే సమయంలో బాలయ్య హిందూపురం నుండి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయినా బాలయ్య తన 2014 మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలవడం విశేషం.

క్రిస్మస్ విడుదలై జై సింహా డైరెక్టర్ సినిమా రూలర్ పై అభిమానులకే పెద్దగా అంచనాలు లేవు. దీనితో వారంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నారు. ఈ మధ్య బోయపాటి టైం కూడా ఏమీ బాలేదు. వరుసపరాజయాలతో ఆయన సతమతం అవుతున్నారు. దీనితో ఈ సినిమా కోసం మరింత కసిగా పని చెయ్యబోతున్నారు. గతంలో బోయపాటి జయజానకి నాయక సినిమాను నిర్మించిన మిర్యాల రవీంద్రరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.