sanjana-singh- mobile theft -సినీ ముద్దుగుమ్మలు ప్రేక్షకుల మనసులు దోచేయడం సహజం. కానీ అందుకు విరుద్ధంగా హీరోయిన్ ఫోన్ ను కొట్టేసాడు ఓ దొంగ. చెన్నైలో జరిగిన ఈ సంఘటన చాలా తమాషాగా ఉంటుంది.తెలుగులో ‘రేణిగుంట’ చిత్రం ద్వారా పరిచయమైన నటి సంజనా సింగ్, ఉదయం 6 గంటల సమయంలో ముగపేర్ నుంచి అన్నా నగర్ లోని తన సోదరి ఇంటికి సైకిల్ పై వెళ్లి వస్తున్న వేళ ఎక్కువ దూరం సైక్లింగ్ చేసింది.

ఈ ఎక్కువ దూరంలో దారి తప్పిన సంజనా, గూగుల్ మ్యాప్స్ లో వెనక్కు వెళ్లే క్రమంలో దారి కోసం వెతుకుతుండగా, సెల్ ఫోన్ ను ఓ దొంగ లాక్కెళ్లిపోయిన ఘటన చోటుచేసుకుంది. చింతామణి సిగ్నల్ సమీపంలో దొంగతనం జరుగగా, ఆ దొంగను వెంబడించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరగా అన్నానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దొంగ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.