Sania Mirza- Shoaib Malik blessed with baby boyఇండియా టెన్నిస్ సంచలనం సానియా మీర్జా – క్రికెట్ రంగంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ జంటకు ఈ రోజు ఉదయం కుమారుడు జన్మించాడు. ఈ విషయాన్ని షోయబ్ మాలిక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ వార్తను ప్రకటిస్తున్నందుకు తానెంతో ఎక్సైట్ అవుతున్నానని, యధావిధిగా తన బేబీ స్ట్రాంగ్ గా ఉందంటూ చెప్పారు.

మీ విషెస్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పిన షోయబ్ మాలిక్ – సానియా మీర్జా జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. నెటిజన్లే కాక షోయబ్ మాలిక్ సహచర క్రికెటర్లు, అలాగే సన్నిహితులు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలను అందిస్తున్నారు.