Sangam diary with a turnover of Rs 1000 croreగుంటూరు జిల్లా సంగం డెయిరీలో అవకతవలకు పాల్పడ్డారు అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్రను ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 1996లో 200 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఈ డైరీ ని నరేంద్ర 1000 కోట్లకు తెచ్చారని.. ఈ డైరీ మీదే కన్నేసే వైఎస్సార్ కాంగ్రెస్ ఈ దురాఘాతానికి పాల్పడిందని టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది.

తాజాగా… డెయిరీ యాజమాన్యాన్ని.. ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేశారు. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసంది. సంగం డెయిరీ రోజువారీ కార్యకలపాల బాధ్యత తెనాలి సబ్ కలెక్టర్‌కు అప్పగించారు. డెయిరీ రోజువారీ కార్యకలాపాలు ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతోనే జీవో విడుదల చేశామని ప్రభుత్వం చెబుతోంది.

ఈ విషయంలో కూడా కొంత డ్రామా జరగకుండా లేదు. ముందు డైరీని గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘం పరిధిలోకి తీసుకుని వస్తూ ఒక జీవో ఇచ్చింది ఏపీ ప్రభుత్వం… ఆ తరువాత వెంటనే ఉపసంహరించుకుని ఆ తరువాత ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేస్తున్నట్టు ఉత్తరువులు ఇచ్చారు.

ఈ వ్యవహారంతో తాము చేసిన ఆరోపణలు నిజమని తేలాయని టీడీపీ అంటుంది. డెయరీ వ్యవహారంలో ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. ఓ వైపు పిటిషన్ కోర్టులో విచారణలో ఉండగా కంగారు గా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం దానికే నిదర్శనం అని వారు ఆరోపిస్తున్నారు.