sandra venkata veeraiah leaves tdpతెలంగాణాలో తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా మూడు సార్లు పోటీ చేసి గెలిచిన సత్తుపల్లి హ్యాట్రిక్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆపార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఆదరించే పరిస్థితి లేదని, టీడీపీలో సుదీర్ఘకాలం నిబద్ధతతో పనిచేశానన్నారు. అయితే… నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని, స్వార్థ రాజకీయాల కోసం కాకుండా తెలంగాణహితం కోసమే నేను పార్టీ మారుతున్నానని సండ్ర అన్నారు.

కార్యకర్తల అభిప్రాయం మేరకే పార్టీ మారుతున్నానని, తెరాసలో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానన్నారు. అవసరమైతే టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ బీ ఫారంపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెంకటవీరయ్య అన్నారు. ఈ మధ్యనే జరిగిన ఎన్నికలలో తెరాస పై తీవ్ర విమర్శలు చేసిన సండ్ర తెలంగాణను రోల్‌ మోడల్‌గా రూపొందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెన్నంటి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని ఇప్పుడు చెప్పడం విశేషం.

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బలం లేకపోయినా ఐదో అభ్యర్థిని నిలబెట్టింది. ఐదో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ఇంకా ఎనిమిది మంది ఎమ్మెల్యేల సపోర్టు కావాలి. నిన్న కాంగ్రెస్ కు చెందిన ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విష్యత్తులో మరికొందరుకాంగ్రెస్‌ ఎమ్మెల్యేలూ టీఆర్‌ఎ్‌సలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఇతర పార్టీల్లో ఉంటూ తమకు మద్దతివ్వటానికి సిద్ధంగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలకూ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది