Sanchita Gajapati Raju chairman for simhachalam templeసింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ గా, అలాగే 1000 ఎకరాల భూములు కలిగిన మానస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా బీజేపీకి చెందిన సంచైత గజపతిని (ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె… వారు అధికారికంగా విడాకులు తీసుకున్నారు) రహస్య జీవో ఇచ్చి తెర మీదకు తెచ్చింది జగన్ ప్రభుత్వం.

ఇప్పటివరకూ ఆ స్థానాల్లో ఉన్న టీడీపీ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుని కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించారు. ఇప్పటివరకూ దానికి సంబంధించిన జీవో కూడా బయటపెట్టలేదు. సంచైత నియామకంలో అన్ని నిబంధనలను అతిక్రమించింది ప్రభుత్వం. ఇది ఇలా ఉందా సంచైత మతం మీద పలు అనుమానాలు ఉన్నాయి.

రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాణస్వీకారం సమయంలో తప్ప ఆమె ఎప్పుడు బొట్టు కూడా పెట్టుకుని కనిపించలేదు. పైగా ట్విట్టర్ లోని ఆమె పాత పోస్టులలో క్రిస్టియానిటీకి సంబంధించిన పోస్టులు, వేడుకలు, ఉండటంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ. ట్రస్టు బోర్డు చైర్మన్ గా అన్యమతస్తులను నియమిస్తే సమస్యలు వస్తాయని హెచ్చరించారు.

దీనిబట్టి సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ గా అన్యమతస్తురాలని నియమించరా అనే అనుమానాలు మరింత బలపడ్డాయి. మరో వైపు… రాజకీయాలతో సంబంధంలేని సంస్థకు రాజకీయాలు ఆపాదించడం దేశానికి అరిష్టమని అశోక్ గజపతి రాజు తెలిపారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు.