Samrat-Reddy-Arrested-Harshita-Reddyయువ నటుడు సామ్రాట్ రెడ్డిపై అతని భార్య హర్షిత హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీసు స్టేషన్ లో దొంగతనం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన సామ్రాట్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది. దీంతో సామ్రాట్ రెడ్డిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

ఐపీసీ సెక్షన్ 498/ఏ కింద నమోదైన ఆ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తాజా కేసులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని నిర్ధారించిన పోలీసులు, సామ్రాట్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అనుష్క ప్రధానపాత్రలో నటించిన ‘పంచాక్షరి’ చిత్రంలో ఆమె భర్తగా నటించిన సామ్రాట్, తెలుగు, తమిళ సినిమాల్లో పలు క్యారెక్టర్ రోల్స్ లో కూడా కనిపించాడు.

హర్షిత వాదన :

తన భర్త సామ్రాట్ రెడ్డికి ఎంతో మంది మగ స్నేహితులు ఉన్నారని, అతనికి, నాకు ఉన్న కామన్ ఫ్రెండ్స్ ద్వారా తన భర్త ఓ ‘గే’ అని తెలుసుకుని హతాశురాలినయ్యానని హర్షిత ఆరోపించింది. తన భర్త దొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, బయటకు వెళ్లినప్పుడు, కారు డ్రైవింగ్ సీట్లో తనను కూర్చోబెట్టి, లేడీ డ్రైవర్ మాదిరిగా చూస్తుండేవాడని ఆరోపించింది.

బయటకు తీసుకువెళ్లిన సమయంలో తనతో బాగున్నట్టు నాటకాలు ఆడుతూ, ఇంటికి వచ్చిన తరువాత శారీరకంగా, మానసికంగా వేధించేవాడని తెలిపింది. అతని గురించి ఎన్ని విషయాలు తెలిసినా, మనసులో బాధపడ్డానే తప్ప బయట పడలేదని, ఎప్పటికైనా మారుతారన్న ఆశతో చాన్నాళ్లు ఎదురు చూశానని హర్షిత చెప్పింది. తన తండ్రి షేర్లను ట్రాన్స్ ఫర్ చేసేందుకు అంగీకరించకపోవడంతో, గత ఏడాదిగా వేధింపులు ఎక్కువయ్యాయని వెల్లడించింది.

తన భర్తను ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నానని, అయితే, ఆ తరువాతే అతని నిజస్వరూపం తెలిసిందని, తన భర్త చాలా దుర్మార్గుడని, తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను కేసు పెట్టానని వెల్లడించింది. వాస్తవానికి సినీ నటుడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేకున్నా, ఆ రంగం నుంచి బయటకు వస్తానని సామ్రాట్ హామీ ఇవ్వడంతోనే పెళ్లికి అంగీకరించానని హర్షిత తెలిపింది. తన అత్త కూడా ఎంతో వేధించిందని ఆరోపించింది. కట్నం తీసుకురావాలని వేధిస్తున్నందునే గతంలో ఓ కేసు పెట్టానని చెప్పింది.

హర్షిత తండ్రి వాదన :

ఈ విషయమై హర్షితారెడ్డి తండ్రి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తన కూతురికి ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాల్లో నటించనని సామ్రాట్ చెప్పిన తర్వాతే తన కూతురిని అతనికి ఇచ్చి పెళ్లి చేశామని, అయితే, ఆ ఒప్పందాన్ని అతను పక్కనపెట్టాడని అన్నారు. తన కూతురు పేరిట ఉన్న ఆస్తులను అతని పేరు మీదకు బదలాయించాలని ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు.

అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధించాడని, దీనిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో గత నవంబర్ 30న ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నెల 25న తన కూతురు ఇంట్లో లేని సమయం చూసి తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులను సామ్రాట్ రెడ్డి చోరీ చేశాడని ఆరోపించారు.

సామ్రాట్ వాదన :

తనకు డ్రగ్స్ అలవాటు ఉందని తన భార్య హర్షిత, ఆమె కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సామ్రాట్ రెడ్డి తెలిపాడు. తనకు ఆ అలవాటే ఉంటే… పోలీసులకు ఎప్పుడో పట్టుబడేవాడినని, తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని అన్నాడు. ఇంట్లో నుంచి డబ్బు, నగలు దొంగలించానని హర్షిత ఆరోపిస్తోందని… అందులో కూడా వాస్తవం లేదని తెలిపాడు. తన ఇంట్లో తనకు కావాల్సిన వస్తువులను మాత్రమే తాను తీసుకున్నానని, కోపంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేశానని, అది మాత్రం తప్పేనని అన్నాడు.