Sampoornesh Support Pawan Kalyan, Sampoornesh Support Pawan Kalyan AP Special Status, Sampoornesh Response Pawan Kalyan Speech AP Special Statusప్రేక్షకుల్లో, ప్రజల్లో పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉన్నా… సినీ పరిశ్రమ నుండి పవన్ కళ్యాణ్ కు రాజకీయ పరంగా పెద్దగా సహకారం లేదన్నది బహిరంగ విషయమే. కొందరు ప్రముఖులైతే ‘కుండబద్దలు కొట్టినట్లు’ ముఖం మీదే చెప్పేస్తుండగా… మరికొందరు రాజకీయాలు తమకు పడవంటూ తప్పుకునే వ్యాఖ్యలు చేసారు. ఈ తరుణంలో ‘జనసేన’ అధినేతకు మద్దతుగా తానున్నాను అంటూ ముందుకొచ్చాడు మన ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబు.

ట్విట్టర్ వేదికగా పవన్ స్పీచ్ గురించి తన అభిప్రాయం తెలిపిన సంపూ… పవన్ కు మద్దతుగా తానూ నిలుస్తానని అన్నాడు. “నేను తెలంగాణాలో పుట్టాను, నా సోదర తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంత కష్టంలో ఉన్నారని, వారి గుండెల్లో ఇంత ఆగ్రహం ఉందని పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ద్వారా తెలిసి గుండె బరువెక్కింది. రాష్ట్రాలు వేరైనా కష్టం వచ్చినపుడు అందరం ఒక్కటే, సీమాంధ్రుల బాధని కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడికి ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు…” అన్న సంపూ దానికి కారణం కూడా వ్యక్తపరిచారు.

“వారు కొంటున్న టికెట్ డబ్బులతోనే మనం బ్రతుకుతున్నాం, పవన్ కళ్యాణ్ గారి ఉద్యమం లో నేను ఒక గొంతు అవుతున్నాను, దీనివల్ల ఏ ఉపయోగం జరగకపోవచ్చు. కానీ, ఏమో నా వల్ల మరొకరు ధైర్యంగా ముందుకు రావొచ్చుగా… జైహింద్… సదా మీ ప్రేమకు బానిస… మీ సంపూర్ణేష్ బాబు…” అంటూ ట్వీట్ చేసారు. అంతేకాదు… ‘మోడీని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్’ అనే అర్ధం వచ్చే ఓ ఇంగ్లీష్ పదాన్ని కేంద్ర ప్రభుత్వానికి చేరేవరకు ట్రెండ్ చేయమని నెటిజన్లకు పిలుపునిచ్చారు.