Sampoornesh-Babu-VIRUS-Movie-Teaser-Talk‘బాహుబలి’ చిత్రంలో సిల్వర్ స్క్రీన్ పైన అనితర సాధ్యమైన అద్భుతాలు ఎన్ని తీసినా ప్రేక్షకులు చూసారు. ఎందుకంటే… అది రాజమౌళి కాబట్టి..! ఆ మాటకొస్తే వేలు తగిలితే కరెంట్ షాక్ కొట్టిందని చెప్పినా కూడా జనాలు కోట్ల రూపాయలతో అభిషేకం చేసారు. దీంతో రాజమౌళి ఏం చెప్పినా చూస్తారనే భావన ట్రేడ్ వర్గాలతో పాటు సినీ అభిమానుల మనసుల్లోనూ నెలకొని ఉంది. అలా కొన్ని విషయాలు రాజమౌళికి మాత్రమే సాధ్యమనిపించేలా ఉంటాయి.

జక్కన్నతో పోల్చడం కాదు గానీ, నరసింహాచారి అలియాస్ సంపూర్ణేష్ బాబు చేసే కొన్ని సీన్లను కూడా ప్రేక్షకులు అలాగే అంగీకరిస్తున్నారు. బహుశా అవే సీన్లు వేరే హీరోలు చేస్తే… బండ బూతులు తిడతారేమో గానీ, సంపూ చేస్తే మాత్రం కామెడీగా చూస్తారు. సైన్స్ స్టూడెంట్ కూడా కాని ఓ వ్యక్తి కృత్రిమ హార్ట్ ను తయారుచేసినా… శివలింగం ముందు ఫోక్ డ్యాన్స్ వేసినా… ప్రేక్షకులు నవ్వుకుంటారు. ఆ క్రమంలోనే తాజాగా “వైరస్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల కాగా, ఇందులో సంపూ హీరోయిజం పక్కన పెడితే, బహుశా ఇవే డైలాగ్స్ ను ఇంకెవరైనా చెప్తే మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యేయి. కానీ, ఓవర్ యాక్షన్ తో కూడిన సంపూ నోట నుండి ఈ డైలాగ్స్ రావడం కామెడీగా మారినా, రొటీన్ గా ఇదే తరహా యాక్టింగ్ ను ప్రేక్షకులు ఎంతవరకు భరిస్తారనేది చూడాలి. ప్రతి సినిమాలోనూ ఇదే తరహా ఓవర్ యాక్టింగ్ ను చేస్తుండడంతో ఈ ‘వైరస్’ ప్రేక్షకులకు ఏ మాత్రం రుచించదు.