ram charan - sampath nandi‘ముఠామేస్త్రీ’గా మెగాస్టార్ చిరంజీవి పేరు మారుమ్రోగడంతో ‘చోటామేస్త్రీ’ అన్న పదం వినగానే మెగా హీరోలు తప్ప మరొకరు జ్ఞప్తికి వచ్చే అవకాశం లేదు. సంపత్ నంది ప్రకటించిన ఈ స్క్రిప్ట్ లో మొదటగా అనుకున్న హీరో పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అది కాస్త ‘గబ్బర్ సింగ్’ పార్ట్ 2గా మారింది. దీంతో ‘చోటా మేస్త్రీ’గా రామ్ చరణ్ ఖాయమని ట్రేడ్ వర్గాలు హల్చల్ చేసాయి. కాలక్రమేణా అది కూడా వెనక్కి వెళ్ళడంతో రవితేజ పేరు తెరపైకి వచ్చింది. కానీ ‘బెంగాల్ టైగర్’గా ప్రేక్షకుల ముందుకు రావడంతో ‘చోటామేస్త్రీ’ స్క్రిప్ట్ మరో హీరో కోసం వేచిచూస్తోంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే… తండ్రి ‘ముఠామేస్త్రీ’ కావడంతో ‘చోటామేస్త్రీ’ అయ్యే అర్హత ఒక్క కొడుక్కే ఉందని, ఇటీవల సంపత్ నంది వినిపించిన ఈ స్క్రిప్ట్ ను రామ్ చరణ్ ఓకే చేసారన్న టాక్ వినపడుతోంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం సంపత్ నంది ఇప్పటికే పూర్తి చేయడంతో… ప్రస్తుతం చెర్రీ చేస్తున్న ‘తనిఒరువన్’ రీమేక్ పూర్తి కాగానే, ఈ ‘చోటామేస్త్రీ’ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందని ట్రేడ్ టాక్.

చెర్రీ – సంపత్ నంది కాంభినేషన్ లో గతంలో వచ్చిన ‘రచ్చ’ కమర్షియల్ సక్సెస్ కావడంతో హిట్ జోడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే గతేడాది విడుదలైన ‘బెంగాల్ టైగర్’ ద్వారా కూడా సంపత్ నంది కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో, కమర్షియల్ సినిమాలకు సంపత్ కేరాఫ్ అడ్రస్ గా మారారు. అయితే కమర్షియల్ సక్సెస్ తో పాటు, ‘మూస’ ధోరణిలో సంపత్ సినిమాలు ఉంటాయన్న టాక్ ను కైవసం చేసుకోవడంతో, తదుపరి సినిమాకు అయినా తన పంథాను మార్చుకుంటారో లేదో చూడాలి.