sameera-video-song-promoలిప్ కిస్ లు, హాట్ హాట్ చిత్రీకరణలు అనేవి బాలీవుడ్ కు రొటీన్. కానీ టాలీవుడ్ లో కూడా ఈ పోకడ ఎక్కువవుతుందోనని చెప్పడానికి అప్పుడప్పుడు ఇలాంటి “సమీరమ్” సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ‘సమీరా’ అనే వీడియో సాంగ్ ప్రోమో వీక్షకులను విశేషంగా అలరిస్తోంది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయే విధంగా లిప్ లాక్ లతో చిత్రీకరణ జరపడం ఈ పాట స్పెషాలిటీ.

ఆడియో పరంగా వినడానికి మాంచి ఆహ్లాదకరమైన సంగీతం, గానంతో మెలోడీలా అలరిస్తుండగా, వీడియో కంటెంట్ పరంగా హాట్ హాట్ సీన్స్ తో సన్నివేశాలను రక్తికట్టించే విధంగా చిత్రీకరించారు. ముఖ్యంగా హీరోయిన్ అమ్రితా ఆచార్య ప్రదర్శించిన హావభావాలు యూత్ కు కిక్ ఎక్కిస్తున్నాయి. యశ్వంత్ హీరోగా నటించిన ఈ సినిమాకు రవి గుండబోయిన దర్శకత్వం వహిస్తుండగా, యజమాన్య సంగీతం అందిస్తున్నారు.