sambhavami-mahesh-babu-movie-first-lookమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్ “సంభవామి”గా దాదాపుగా ఖరారైనట్లే. చివరి నిముషం ట్విస్ట్ లు ఏమైనా ఉంటాయేమో ఇప్పుడే చెప్పలేం గానీ, ఈ సినిమా ఫస్ట్ లుక్ అంశం దసరా నుండి హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. అప్పటి నుండి ‘అదిగో ఇదిగో’ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కాస్త, ప్రస్తుతం కొత్త సంవత్సరాన్ని టార్గెట్ చేసుకుంది.

జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం కానుకగా “సంభవామి” ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్లు లేటెస్ట్ న్యూస్. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులను తమ ప్రజ్ఞపాటావాలకు పని చెప్పారు. అందులో భాగమే ఈ “సంభవామి” ఫస్ట్ లుక్ పోస్టర్. బహుశా చిత్ర యూనిట్ రూపొందించినా ఇంతకంటే బాగుంటుందో లేదో డౌటే గానీ, ఈ పోస్టర్ మాత్రం అదిరిపోయింది.

పోస్టర్ లో వాడిన బ్యాక్ గ్రౌండ్ డిజైన్ నుండి “సంభవామి” టైటిల్ లోగో వరకు మరియు లోగోలో బ్యాక్ గ్రౌండ్ లో వాడిన రెడ్ కలర్ తో సహా అన్ని ప్రిన్స్ అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాయి. దీంతో ‘ఫ్యాన్ మేడ్’ ఫస్ట్ లుక్ పేరిట సోషల్ మీడియాలో “సంభవామి” ఫస్ట్ లుక్ హల్చల్ చేస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు మురుగదాస్ ఇప్పటికే స్పష్టం చేయడంతో, ప్రిన్స్ యాంగ్రీ లుక్ ను ఈ పోస్టర్లో ఉంచడం విశేషం.