Samanthakamani - Mahesh Babuయువ హీరోల మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని పాత్రల ఫస్ట్ లుక్స్ ఇటీవల విడుదలై హంగామా చేసిన సంగతి నెటిజన్లకు తెలిసిందే. ఈ సినిమాలో ‘కృష్ణ’ పాత్ర పోషిస్తున్న సుధీర్ బాబు లుక్ ను ప్రిన్స్ మహేష్ బాబు విడుదల చేయగా, ఇతర పాత్రలలో ‘కార్తీక్’గా ఆది, ‘కోటిపల్లి శివ’గా సందీప్ కిషన్, ‘ఇన్స్పెక్టర్ రంజిత్’గా నారా రోహిత్ నటిస్తున్నారు. అయితే ఈ నలుగురి యువ హీరోలతో పాటు మహేష్ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అంటే మహేష్ బాబు అంటే ప్రిన్స్ మహేష్ బాబు కాదు గానీ, ‘మహేష్ బాబు’ పాత్రలో నటికిరిటీ రాజేంద్రప్రసాద్ కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేసారు చిత్ర యూనిట్. రాజేంద్ర ప్రసాద్ బ్యాక్ యాంగిల్ నుండి విడుదల చేసిన ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమా టీజర్ డేట్ ను కూడా జూన్ 15వ తేదీగా ఖరారు చేసారు. ఆనంద్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండడం ప్రధాన ప్లస్ పాయింట్లలో ఒకటి.