Samantha -Wedding Photo Naga Chaitanyaగోవాలో కుటుంబ సభ్యుల నడుమ చాలా నిరాడంబరంగా నాగచైతన్య – సమంతల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహాన్ని పురస్కరించుకుని ఫ్యాన్స్ చూపించిన అభిమానానికి సమంత ఫిదా అయ్యింది. ఫోటోషాప్ లో చేసిన ఫోటోనే అయినా… నిజంగా పెళ్లి కూడా కేవలం వీరి నడుమే జరగనుండడంతో ఫ్యాన్స్ క్రియేటివిటీకి సలాం కొట్టక తప్పలేదు. ఈ ఫోటోలో అసలు స్పెషాలిటీ ఏమిటంటే…

ప్రస్తుతం తమ మధ్య లేకపోయిన అక్కినేని నాగేశ్వరరావు మరియు అన్నపూర్ణలు కూడా బ్యాక్ సైడ్ ఫోటో నుండి ఆశీర్వదించడం. అంతగా నచ్చబట్టే ఈ ఫోటోను అభిమానులు సోషల్ మీడియా పోస్ట్ చేయగా… చాలా ముద్దుముద్దుగా ఉందంటూ కితాబిచ్చింది. అంతేకదా… మరికొద్దిగంటల్లో జరగనున్న కార్యక్రమం ముందుగానే కనపడితే… ఆనందానికి అవధులు ఉంటాయా! సమంత కూడా ప్రస్తుతం అలాంటి అనుభూతులనే చవిచూస్తోంది.