Samantha ruth prabhuజూలై 15వ తేదీ నుండి మురుగదాస్ – మహేష్ బాబు కాంభినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ప్రిన్స్ ప్రస్తుతం యుకేలో హాలిడే మూడ్ లో ఉండగా, మురుగదాస్ మాత్రం ప్రిన్స్ మూవీ కంటే ముందు మరొక సినిమాను పూర్తి చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. గత కొంత కాలంగా సోనాక్షి సిన్హాతో “అకిరా” సినిమాను తెరకేక్కిస్తున్న మురుగదాస్, ఈ సినిమా టైటిల్ లోగోలో సోనాక్షి కళ్ళు పెట్టి, ఆసక్తికరంగా ఉండేలా ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో విడుదల చేసారు.

ఈ పోస్టర్ చూసిన సమంత ‘ఆగలేకపోతున్నాను… సినిమా చూడడానికి’ అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేసింది. దీనికి ప్రతిస్పందించిన మురుగదాస్… ‘థ్యాంక్ యు… నమస్కారం అండి…’ అంటూ చెప్పడంతో సమంత ఒక్కసారిగా నవ్వేసింది. కారణం అర్ధమైందిగా తమిళ దర్శకుడు తెలుగులో ‘నమస్కారం’ చెప్పడంతో ‘హ హ హ…’ అంటూ నవ్వుతో ప్రేమకు చిహ్నంగా ఉండే గుర్తును, నమస్కారాన్ని ప్రతిబింబించే గుర్తును పోస్ట్ చేసింది. నిజానికి సమంత మాదిరే మురుగదాస్ నుండి వచ్చిన తెలుగు సమాధానం అందరినీ అవాక్కు చేసింది.

బహుశా మహేష్ బాబు తో సినిమా చేస్తున్న ప్రభావం కావచ్చు లేక సమంత తన జీవితకాలం తెలుగులోనే స్థిరపడబోతుందన్న సంకేతాలను మురుగదాస్ ఇచ్చారా..? అంటూ నెటిజన్లు కొత్త చర్చకు దారితీసారు. ఎందుకంటే… ఈ పోస్టర్ పై చాలా మంది సినీ సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ, ఒక్క సమంతకు మాత్రమే మురుగదాస్ తెలుగులో సమాధానం ఇచ్చారు. ఆంతర్యం ఏమైనా గానీ… మురుగదాస్ తెలుగు పాండిత్యం ఆడియన్స్ ను ఫిదా చేస్తోంది.