అది మ్యాటర్... భారమంతా బ్యూటీ పైనే..!డిసెంబర్ 17వ తేదీన అయిదు భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్ధమవుతున్న “పుష్ప” సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. ఐటెం ఆర్ స్పెషల్… పేరు ఏదైనా సుకుమార్ సినిమాలలో ఇలాంటి ఓ పాట ఉండడం చాలా సహజం. అందుకు తగ్గట్లుగానే ఆ పాట బంపర్ హిట్ కావడం కూడా రొటీన్ గా జరుగుతూ వస్తోంది.

‘రంగస్థలం’ సినిమాలో జిగేల్ రాణిగా పూజా హెగ్డేతో స్టెప్పులు వేయించిన సుకుమార్, “పుష్ప”లో ‘రంగస్థలం’ హీరోయిన్ అయిన సమంతతో కాలు కదిపించనున్నారనే టాక్ వినపడుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ‘పుష్ప’ సినిమాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈ పాట నిలిచిపోనుందని చెప్పడంలో సందేహం లేదు.

Also Read – పిఠాపురంలో ఈ హడావుడి ఏమిటో…

చైతూతో బ్రేక్ ప్రకటన తర్వాత సమంత తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పైన కనిపించనుండడమే ఈ క్రేజ్ కు ప్రధాన కారణం. ఈ పాటలో సమంత ధరించబోయే కాస్ట్యూమ్స్ నుండి స్టెప్పుల వరకు ప్రతిదీ కూడా ఈ ‘బ్యూటీ’ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో అందరి చేత ఊర మాస్ లుక్ లను ప్రజెంట్ చేస్తున్న సుక్కు, ‘జెస్సీ’ని ఎలా చూపించబోతున్నారో మరి!