samantha-south-scope-ritzత్వరలో అక్కినేని వారింట అడుగు పెట్టబోతున్న ముద్దుగుమ్మ సమంత, తాజాగా సౌత్ స్కోప్ కు ఓ అదిరిపోయే ఫోటోషూట్ ను ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సమంత కాస్ట్యూమ్స్… హావభావాలు అభిమానులకు మాంచి కిక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. అయితే సినిమాలు అంగీకరించని సమంత, ఇలా ఫోటోషూట్ లలో పాల్గొనడం వెనుక ఆంతర్యం ఏమిటో అన్న చర్చ టాలీవుడ్ వర్గాల్లో వినపడుతోంది.

బహుశా పెళ్లికి ముందే ఎలాంటి ఫోటోషూట్ ముచ్చట్లు ఉన్నా తీర్చేసుకోవాలని భావించిందో ఏమో గానీ, ఓ రేంజ్ లోనే ఈ ముద్దుగుమ్మ అందాల విందు చేసింది. దానికి తోడు హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ అభిమానుల మతులు పోయేలా చేస్తోంది. మొత్తానికి అక్కినేని వారి కోడలు చేస్తున్న హంగామా మామూలుగా లేదంటూ… సోషల్ మీడియాలో మరోసారి ఈ ‘కుందనపు బొమ్మ’ హాట్ టాపిక్ అయ్యింది.