Janatha Garage Audio, Samantha Janatha Garage Audio, Samantha Janatha Garage Audio Launch, Samantha Janatha Garage Audio Function, Samantha Not Well  యంగ్ టైగర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “జనతా గ్యారేజ్” ఆడియో వేడుకకు ఫస్ట్ జలక్ ఎదురయ్యింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్లుగా సమంత, నిత్యామీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆడియో వేడుకలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కళకళలాడతారని భావించిన అభిమానులకు టాప్ హీరోయిన్ సమంత షాక్ ఇచ్చింది.

‘తనకు ఈ రోజు ఆరోగ్యం బాగోలేదని, కనుక ఆడియో వేడుకను మిస్ అవుతున్నానని, అమేజింగ్ ఆడియో విడుదల కాబోతోందని’ సమంత చేసిన ట్వీట్ ‘బుడ్డోడు’ అభిమానులను నిరాశ పరిచింది. మరి మరో ముద్దుగుమ్మ నిత్యామీనన్ అయినా సందడి చేస్తుందో లేదో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. సాధారణంగా ప్రమోషన్లకు సమంత దూరంగా ఉండే టైపు కాకపోవడంతో, బహుశా మరో ‘జనతా గ్యారేజ్’ ఈవెంట్ లో అభిమానులకు దర్శనమిస్తుందేమో చూడాలి.