ఇటీవల కాలంలో హైదరాబాద్ లో చక్కర్లు కొట్టిన ప్రేమ జంట ‘నాగచైతన్య – సమంత’ల ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక్కసారిగా సమంత సైలెంట్ అయిపోయి, తన సహచర హీరోయిన్లతో కలిసి యూరోప్ ట్రిప్ చెక్కేసింది. రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, నీరజ కోనలతో ఉన్న ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేయగా, అసలు ఈ టూర్ వెనుక స్కెచ్ వేరే ఉందన్న విషయం తాజాగా హల్చల్ చేస్తున్న ఇతర ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ టూర్ లో కేవలం రకుల్, రెజీనా వంటి హీరోయిన్లే కాదు, రవితేజ, రానా, నాగచైతన్య వంటి హీరోలు కూడా ఉన్నారన్న విషయం తాజాగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫోటోలు చెప్తున్నాయి. అయితే ఈ ట్రిప్ అసలు ఉద్దేశం… చైతూ – శ్యామ్ ల ఏకాంతం కోసమేనన్న వార్త చక్కర్లు కొడుతోంది. సదరు ఫోటోలలో సమంత – నాగచైతన్యలు కలిసి ఎక్కడా దర్శనమివ్వలేదు గానీ, హీరోలతో కలిసి చైతూ, హీరోయిన్లతో కలిసి సమంత విడివిడిగా కనపడ్డారు.
ఇప్పటికే వీరిద్దరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారడంతో, మరింత ప్రచారానికి తెరలేపకుండా… ఇద్దరూ జాగ్రత్త పడ్డారని, ఈ యువజంటను కలిపేందుకు సినీ సహచరులంతా ఏకమయ్యారని, అందుకే అందరూ బెల్జియం టూర్ ప్లాన్ చేసారన్న వార్తల్లో వాస్తవం ఎంత ఉందో గానీ, నెటిజన్లలో ఎప్పుడూ హాట్ హాట్ గా సందడి చేస్తున్నారు.