ఎంతో ముచ్చటపడి ‘డెస్టినేషన్ వెడ్డింగ్’ చేసుకున్న నాగచైతన్య – సమంతలు ఎందుకు విడిపోయారు? అన్న మిస్టరీ ఇంకా బయటకు రాలేదు. అయితే చైతూతో బ్రేకప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సమంత ఎలా సందడి చేయబోతోంది? అలాగే ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉండబోతోంది? అన్న అంశం మాత్రం హాట్ టాపిక్ గా మారాయి.
ఈ రెండింటికి సమాధానంగానే ప్రస్తుతం ఓ రెండు పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. “పుష్ప” సినిమాలో ఈ ‘జెస్సీ’ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా ప్రజెంట్ చేసిన ఈ స్టిల్ లో నిజంగానే సమంత సిజ్లింగ్ లుక్ తో కనిపించింది.
అలాగే ఆఫ్ స్క్రీన్ కు సంబంధించి ‘ఎల్లే’ మాగజైన్ కు ఇచ్చిన ఫోటోషూట్ స్టిల్స్ నెట్టింట హాట్ కేకుల్లా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా బ్రౌన్ ట్రాన్సపరెంట్ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోతూ తళుక్కుమన్న శ్యామ్ స్టిల్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
మొత్తానికి తన బ్రేకప్ లైఫ్ నుండి సమంత బయటపడి స్వతంత్రురాలిగా నిలబడడం అభిమానులకు ఆనందదాయకంగా మారింది. ఇప్పటికే ఓ ఇంటర్నేషనల్ మూవీకి కూడా సైన్ చేసిన సమంత, రాబోయే కాలంలో ఈ “దూకుడు” మరింత ఉధృతి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
Three Years Of Jagan: Record Majority To Unbelievable Fall
Undavalli’s Estimation About Alliances In AP