Samantha Ruth Prabhu item song in Pushpaచైతూతో బ్రేకప్ అయిన తర్వాత తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమన్న సమంత సాంగ్ ‘ఉ అంటావా… ఊఊ అంటావా’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ‘పుష్ప’ రిలీజ్ కు కొద్దీ రోజుల ముందు విడుదలైన లిరికల్ సాంగ్ తో దుమ్ముదులిపేసిన సమంత స్క్రీన్ పైన ఎలా కనిపించింది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

దీంతో గడిచిన 24 గంటలుగా ధియేటర్స్ లో రికార్డ్ అయిన సమంత వీడియో క్లిప్పింగ్స్ తో సోషల్ మీడియా మునిగిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతగా హాట్ అండ్ సిజ్లింగ్ అవతారంలో కనిపించిన సమంత విజువల్స్ స్క్రీన్ పైన లిరిక్స్ కలిగించినంత ఆసక్తిని కలిగించలేకపోయాయి. రిలీజ్ కు ముందు వచ్చిన పబ్లిసిటీకి, సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తోన్న టాక్ కు ఎక్కడా పొంతన లేకుండా పోయింది.

మరి ఈ ఐటెం సాంగ్ ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది? అంటే తాను ఎలాంటి రోల్స్ చేయడానికైనా సిద్ధం అన్న సంకేతాలను ఇండస్ట్రీ వర్గాలకు తెలియజెప్పాలనుకున్నట్లుగా కనపడుతోంది తప్ప, ఈ ఐటెం సాంగ్ పరంగా సమంతకు పెద్దగా ఒరిగింది అయితే ఏమీ లేదు. సోషల్ మీడియాలో రన్ అవుతోన్న విజువల్స్ తో అక్కినేని అభిమానులు మాత్రం ఈ బ్యూటీపై కాస్త గుర్రుగానే ఉన్నారు.

ఒకవేళ “పుష్ప” సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే, కనీసం ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు సమంత సాంగ్ దోహదం చేసిందన్న పేరు, కీర్తి లభించేది. సరిగ్గా ఇదే “రంగస్థలం” సినిమాలో పూజా హెగ్డేకు వచ్చింది. కానీ “పుష్ప” సాంగ్ మాత్రం ఆ స్థాయిలో అలరించ లేకపోవడంతో, ప్రతి సినిమాలో ఉండే రొటీన్ ఐటెం సాంగ్ మాదిరే సమంత ఐటెం సాంగ్ కూడా మిగిలిపోవడం నిరాశాజనకంగా మారింది.