మండుటెండల్లో ‘కుందనపు బొమ్మ’ చేస్తోన్న అందాల విందు నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల ‘కాస్మోపోలిటన్’ కవర్ పేజీపై దర్శనమిచ్చిన సమంత, తాజాగా ఆ ఫోటోషూట్ కు సంబంధించిన మరిన్ని ఫోటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి.
గతంలో లేని విధంగా సమంత సౌందర్యాలను బహిరంగపరుస్తూ ఉన్న పిక్స్ సోషల్ మీడియాను చుట్టేసాయి. ‘అసలైన సమ్మర్ సెగ’ అంటే ఇదే కదా అని కీర్తించడం నెటిజన్ల వంతవుతోంది. ఆ రేంజ్ లో మన ‘జెస్సీ’ కనులవిందు చేస్తోంది.
అయితే ఈ సోయగాల ప్రదర్శన విడాకుల తర్వాత మరింత దూకుడు అవ్వడమే సమంతను హాట్ టాపిక్ గా మార్చేస్తోంది. తన స్నేహితులతో కలిసి బికినీ ఫోటోలు, ‘పుష్ప’లో హాట్ హాట్ ప్రదర్శన, ఇటీవల ‘క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్’లో మతిపోగొట్టేలా మతిపోగొట్టేలా గ్రీన్ గౌన్ కాస్ట్యూమ్… ఇవన్నీ కూడా విడాకుల అనంతరం ఒక దానిని మించి మరొకటి అన్న రీతిలో సాగుతోంది.
అలాగే ‘బ్లెండర్ స్ప్రైడ్ ఫాషన్ టూర్’ విందు మరియు ఈ ‘కాస్మోపాలిటన్’ ఫోటోషూట్ అన్నీ కూడా సమంతకంటూ ఓ సపరేట్ ‘బ్రాండ్’ను సృష్టించేలా ఉన్నాయి. బహుశా గతం నుండి తానే కాదు, తన ఫ్యాన్స్ కూడా పూర్తిగా మరిచిపోవాలని అనుకుంటుందో ఏమో గానీ, సమంత నుండి వెలువడుతున్న ప్రతి ఒక్కటి వైరల్ అవుతోంది.
రిక్రియేషన్, యాడ్స్, ఫోటోషూట్స్, ఈవెంట్స్, ఐటెం సాంగ్స్ పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల కొత్తగా ఒప్పుకున్న హాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో సమంత రోల్స్ ఇక ప్రేక్షకుల ఊహలకు అందని రీతిలో ఉంటాయేమో అని చర్చించుకోవడం అభిమానుల వంతవుతోంది. ఏది ఏమైనా సిల్వర్ స్క్రీన్ పై సమంత పేరు మరోసారి సెన్సేషన్ అయ్యేలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.
Three Years Of Jagan: Record Majority To Unbelievable Fall
That Section Of Only NTR Fans Are YCP Coverts?