Samantha Tweet, Samantha Tweet Naga Chaitanya, Samantha Tweet Premam Movie, Samantha Tweet Premam Poster, Samantha Tweet Naga Chaitanya Premam Poster‘కుందనపు బొమ్మ’ సమంతనా మజాకా..! అన్న రీతిలో గత కొన్ని మాసాలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోన్న సమంత, తాజాగా మరోసారి నెటిజన్లకు కడుపు నిండుగా వార్తను పెట్టింది. పుకార్లకు తెరదించుతూ తన తాజా సినిమా “ప్రేమమ్”కు సంబంధించిన ప్రకటనను ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన నాగచైతన్య ట్వీట్ కు సమంత ఇచ్చిన స్పందన సోషల్ మీడియాలో మరోసారి అలజడికి కారణమైంది.

చైతూ చేసిన ట్వీట్ కు మూడు ‘లవ్’ సింబల్స్ తో తన అభిప్రాయం చెప్పింది సమంత. బహుశా ఇదే వేరే ఎవరి సినిమానో అయితే ఇంత హాట్ టాపిక్ అయ్యేది కాదేమో గానీ, అది చైతూ సినిమా కావడం, ఆ టైటిల్ ‘ప్రేమమ్’ అయి ఉండడంతో నెటిజన్లకు మరింత ఉత్సహాన్నిచ్చినట్లయ్యింది. దీంతో ‘మీ ఇద్దరూ ఎప్పుడూ పెళ్లి చేసుకోబోతున్నారు?’ అంటూ పలు ప్రశ్నలను సంధించడం ట్వీట్ ప్రియుల వంతయ్యింది.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సమంత, మళ్ళీ మునుపటి స్థాయిలోనే సందడి చేస్తోంది. చైతూ సినిమా కావడంతోనే ‘లవ్’ సింబల్స్ ని పెట్టి, ఒక రకంగా సమంత ఎంజాయ్ చేస్తోందని, వేరొకరి సినిమా అయితే స్పందన వేరే విధంగా ఉండేదన్న టాక్ కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ‘చైతూ – శ్యామ్’ల మ్యాటర్ మళ్ళీ హంగామా చేస్తోంది.