Samantha, Samantha Helps Chandini, Samantha Helps Chandini Surgery, Samantha Pratyusha Foundation  Helps Chandini Surgery, Samantha Helps Chandini Disarticulation Surgery ఇటు తెలుగు, అటు తమిళ పరిశ్రమల్లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న హీరోయిన్ సమంత. టాప్ హీరోలు, నిర్మాతలతో సినిమాలు చేస్తూ కోట్లలో రెమ్యునరేషన్ సంపాదిస్తున్న ఈమెకు సేవా దృక్పథం నిండిన మనసు కూడా ఉంది. ఆర్ధిక స్తొమత లేక వైద్యానికి దూరమవుతున్న పిల్లల కోసం కొన్నేళ్ల క్రితం ప్రత్యూష ఫౌండషన్స్ స్థాపించిన సమంత ఇప్పటికే ఏంతో మంది పిల్లలకు వైద్య సహాయం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది.

తాజాగా సమంత ఓ ప్రమాదంలో తన ఎడమ కాలు కోల్పోయిన చిన్నారి భవానికి ఉచితంగా వైద్య సహాయం అందించి కృతిమ కాలును ఏర్పాటు చేయించి ఆ చిన్నారికి నడిచే అదృష్టం కల్పించింది. నగరంలోని ప్రముఖ ఆసుపత్రి మ్యాక్స్ క్యూర్ లో డాక్టర్ మంజుల ఆధ్వర్యంలో ఈ సర్జరీ నిర్వహించారు.

తమ బిడ్డకు కొత్త జీవితం అందించిన సమంతకు భవాని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యం చేయించడానికి డబ్బులులేని పరిస్థితిలో తమ భాధను గుర్తించి, సమంత తానే స్వయంగా వచ్చి సాయం అందించిందని సంతోషం వ్యక్తం చేశారు. సమంత చేస్తున్న ఈ మంచి పనుల వల్ల ఇంకొంతమంది సెలబ్రిటీలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని ఆశిద్దాం.