Samantha Participated in a virtual conference on World Environment Day.సహజంగా పెళ్లయిన హీరోయిన్లకు క్రేజ్ తగ్గుతుంది అయితే సమంతకు మాత్రం క్రేజ్ అంతకంతకు పెరుగుతుంది. తాజాగా ఆమె ది ఫ్యామిలీ మాన్ 2 సూపర్ సక్సెస్ తో మంచి జోరు మీద ఉంది. తాజాగా ఆమె ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఫిక్కి లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఫ్లో) హైదరాబాద్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వర్చ్యువల్‌ సదస్సు లో పాల్గొంది.

కరోనా కారణంగా మనలో ఎన్నో మార్పులు వచ్చాయి. మా ఇంట్లో పచ్చదనాన్ని స్వాగతించాం. ఫుడ్‌ పట్ల నాకున్న అభిప్రాయాలను సమూలంగా మారిపోయాయి. నా ఆహారం నేనే పండించుకుంటున్నాను. ఇందుకోసం హైడ్రోఫోనిక్‌ సాంకేతికత వినియోగిస్తున్నాను. ఈ సాంకేతికత వల్ల సాధారణంగా వినియోగించే నీటిలో కేవలం ఐదు శాతమే వాడుతున్నాం” అని చెప్పుకొచ్చింది ఆమె.

ఆంగ్లో-ఇండియన్‌ ఫ్యామిలీకి చెందిన తాను నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటడం అంటే అతి పెద్ద మార్పు అని… తాను ఇప్పుడు వేగన్ గా మారిపోయానని… “మాంసాహారం తగ్గించుకోండి. ఆ దిశగా ముందుగా అవసరమైనప్పుడు మాత్రమే కొనండి. మీ ఆహారం మీరే పండించుకోవడానికి ప్రయత్నించండి’ అని సమంత చెప్పుకొచ్చింది.

సమంత చెప్పింది మంచి విషయమే అయితే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున జోకులు వెల్లివిరుస్తున్నయి. “అయ్యో సమంత… ముక్క లేకపోతే ఎలా? ఏదైనా చెప్పు అది తప్ప” అని కొందరు…. “సండే వచ్చిందంటే కరోనా ని లాక్ డౌన్ ని కూడా పట్టించుకోకుండా లైన్ లో నిలబడతాం… తగ్గించడం ఎలా కుదురుతుంది?,” అంటూ ఇంకొందరు సరదా మెస్సేజ్లు ఆమెకు పంపుతున్నారు.