Nithin Samanthaఒత్తిడిలో ఉన్నపుడు తమకు తెలియకుండానే ఒక్కొక్కరు ఒక్కోటి చేసేస్తుంటారు. ఎక్కువ మంది అయితే చేతి వ్రేళ్ళ గోళ్ళు తినేస్తుంటారు. మరికొందరు మనస్పూర్తిగా ఓ దమ్ము లాగించేస్తుంటారు. మరి ‘అ…ఆ…’ సినిమా హీరోహీరోయిన్లు నితిన్, సమంత ఏం చేస్తుంటారు? దీనిపై ప్రేక్షకులు బుర్ర చించుకునే అవకాశం లేకుండా వాళ్ళే సమాధానం ఇచ్చారు. ‘అ… ఆ…’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియాలో పాల్గొన్న వీరిద్దరూ తమ అనుభూతులను పంచుకున్నారు.

సినిమా రిలీజ్ అవుతోందంటే చాలా ఒత్తిడికి గురవుతామని… రిజల్ట్ ఎలా ఉంటుందోనని టెన్షన్ మొదలైందని అన్నారు. రేపు మార్నింగ్ షో చూడాలని ఉందని, అయితే రేపటి వరకు ఒత్తిడికి తట్టుకోగలిగితే అభిమానులతో కలిసి చూస్తానని నితిన్ చెప్పాడు. తాను మాత్రం సినిమా హిట్టా, ఫట్టా అన్నది రిజల్ట్ వచ్చిన తరువాతే చూస్తానని సమంత చెప్పింది. అయితే సినిమా రిజల్ట్ వచ్చే వరకు విపరీతంగా తింటామని, ఒత్తిడిలో ఉంటే ఏం దొరికినా తింటామని ఇద్దరూ చెప్పుకొచ్చారు.

‘అ… ఆ…’ మంచి ఫీల్ గుడ్ సినిమా అని, త్రివిక్రమ్ బెస్ట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ అని కీర్తించిన సమంత, నితిన్ తన కెరీర్ పై ఫోకస్ చేసి, వ్యక్తిగత జీవితాన్ని మర్చిపోయాడని, అందుకే తొందరగా పెళ్లి చేసేయాలని, ఈ సినిమా హిట్టయితే వెంటనే నితిన్ కు పెళ్లేనని సమంత జోక్ చేసింది. దీంతో తన పెళ్లి గురించే కాక, సహచర హీరోల పెళ్లి గురించి కూడా సమంత కామెంట్లు చేస్తోందని నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు.