samantha Latest‘సెక్స్’ గురించి బహిరంగంగా మాట్లాడేటంత ధైర్యం కలిగిన ‘కుందనపు బొమ్మ’ సమంత నోట మళ్ళీ ‘హనీమూన్’ మాట వెలువడింది. గతంలో వివిధ సందర్భాలలో హనీమూన్ గురించి ప్రస్తావిస్తూ… అక్కడ ప్లాన్ చేసుకుంటున్నామని, ఇక్కడ జరుపుకోవాలని భావిస్తున్నామని చెప్పి చిరునవ్వులు చిందించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం అందుకు విరుద్ధంగా అసలు హనీమూన్ నే రద్దు చేసుకున్నట్లుగా తెలిపింది.

మీడియాలో వస్తున్నట్లుగా అక్టోబర్ లో జరగనున్న తమ వివాహం అంగరంగ వైభవంగా ఉండబోదని, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు, స్నేహితుల మధ్య మాత్రమే జరుగుతుందని, అది కూడా ఓ సాధారణ కుటుంబ వివాహం ఎలా జరుగుతుందో అలాగే ఉంటుంది తప్ప, భారీ స్థాయిలో ఉండబోదని తేల్చిచెప్పిన సమంత, పెళ్ళైన మూడవ రోజే మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటామని స్పష్టం చేసింది.

చైతూ – సమంతలు ఇద్దరు ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నారో లేక పత్రికా ముఖంగానే ఈ విషయం చైతూకు తెలుస్తుందో ఏమో గానీ, ఇది మాత్రం ఊహించని సంఘటనే. బహుశా తాము కమిట్ అయిన సినిమాల షూటింగ్ లు పూర్తి చేసి, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇద్దరు సస్పెండ్ చేయాలని భావిస్తున్నారేమో! ఏది ఏమైనా హనీమూన్ గురించి కూడా బహిరంగంగా వ్యాఖ్యానించగల సమర్ధురాలు ఒక్క సమంతనే అని చెప్పకతప్పదు.