samantha files case on three youtube channelsకొన్ని రోజుల క్రితమే నాగ చైతన్య , సమంత తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొన్ని యూ ట్యూబ్ చానెల్స్ ఆమెకి ఇబ్బంది కలిగించేలా వీడియోస్ పెట్టారు.

సమంత విడాకుల వెనుక అసలు కథేంటి ? అన్నట్టుగా కొన్ని కథనాలు పెట్టారు. హద్దు దాటేసి సమంత మరొకరితో ఎఫైర్ పెట్టుకుందని కూడా వీడియోస్ పెట్టారు. దీంతో సమంత తరుపున న్యాయవాది బాలాజీ ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై కేసు పెట్టి వాదిస్తున్నారు.

కుకట్ పల్లీ లో న్యాయ స్థానంలో ఈ కేసుపై విచారణ జరుగుతుంది. తాజాగా బాలాజీ వాదనలు విన్న న్యాయ స్థానం కేసుని ఈ నెలాఖరున 25కి వాయిదా వేసింది. సమంత పెర్సనల్ లైఫ్ అలాగే సినిమా లైఫ్ డిస్టర్బ్ అయ్యేలా వారు పెట్టిన ఛానెల్స్ పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాలాజీ గట్టిగా వాదించారు.

భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ఆయన న్యాయ స్థానాన్ని కోరారు. ఇక ఈ విషయాన్ని సమంత చాలా సీరియస్ గా తీసుకుంది. తనపై తప్పుడు ప్రచారం చేసి వీడియోలు పెట్టిన ఛానెల్స్ ని పర్మినెంట్ మూయించే విధంగా జడ్జిమెంట్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తుంది. మరి 25న వాయిదా పడిన ఈ కేసులో న్యాయస్థానం నుండి ఎలాంటి తీర్పు వస్తుందో సమంత వీడియోలతో భారీ వ్యూస్ అందుకున్న యూ ట్యూబ్ చానెళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.