Shakuntalamచాలా కాలం రానా కోసం హిరణ్య కశ్యప అనే పీరియడ్ సినిమా మీద పని చేసిన గుణశేఖర్… కరోనా కారణంగా ఆ సినిమాని కొంత కాలం వాయిదా వెయ్యడంతో ఈలోగా మరో సినిమా చేస్తున్నారు. ఈ గ్యాప్ లో ‘శాకుంతలం’ సినిమాను తీయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. విభిన్నమైన పౌరాణిక ప్రణయ గాథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారాయన.

ఈరోజు కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా ఈ సినిమాలో సమంత నటించనున్నట్టు ప్రకరించారు గుణశేఖర్. పెళ్లి తరువాత కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సమంత.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. దానితో శాకుంతలం సినిమాకు వెంటనే ఒకే చెప్పింది.

సమంత కెరీర్లో ఒక పీరియడ్ సినిమా చెయ్యడం ఇదే మొదటి సారి. మరి ఇలాంటి పాత్రకు ఏ మేరకు న్యాయం చేస్తుందనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. మహాకవి కాళిదాసు రాసిన శాకుంతలం నాటకం .. వెస్ట్రన్‌ భాషల్లో అనువాదం అయిన భారతీయ నాటకాల్లో మొదటిది.

అంతేకాదండోయ్‌ 1889లో ఈ నాటకాన్నినార్వేజియన్‌, ఫ్రెంచ్‌, ఆస్ట్రియన్‌, ఇటాలియన్‌ వంటి 46 భాషలలోకి అనువాదం చేశారు. ఇప్పుడు ఈ నాటకాన్నే గుణశేఖర్‌ దృశ్య కావ్యంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా నటించేది ఎవరో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.