Samantha akkineni says no to PV sindhu biopicఅక్కినేని సమంత ఈ వేసవికి ఓ బేబీ తో పెద్ద హిట్ కొట్టింది. అయితే ఆ తరువాత సినిమాలేవీ సైన్ చెయ్యలేదు. ప్రస్తుతం ఆమె ఖాతాలో శర్వానంద్ 96 రీమేక్ సినిమా మాత్రమే ముందు. ఈ అమ్మడు ప్రస్తుతం స్పెయిన్ లో నాగచైతన్య తో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తుంది. ఈ తరుణంలో ఆమె ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ బయోపిక్ లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే మనకు ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటివరకూ సమంతను ఈ సినిమా కోసం సంప్రదించలేదు.

అదే సమయంలో సంప్రదించినా ఆమెకు చేసే ఉద్దేశం లేదట. “ఆ సినిమా చెయ్యాలంటే చాలా ఫీజికల్ స్ట్రెస్ కు గురి కావాలి. ఎన్నో కసరత్తులు చెయ్యాలి. వచ్చే ఏడాది సమంత పిల్లలని కనడానికి ప్లాన్ చేసుకుంటుంది. ఈ తరుణంలో అటువంటి పాత్ర అంటే కష్టమే. అదే సమయంలో పీవీ సింధూ చాలా హైట్ గా ఉంటుంది ఆ పాత్రకు తాను సరిపోనని సమంత అభిప్రాయం,” అని ఆమెకు దగ్గరగా ఉండే కొందరు చెబుతున్నారు. సమంత చెప్పే కారణాలు సహేతుకంగానే కనిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వూలో సింధు.. త‌న పాత్ర‌లో ఖ‌చ్చితంగా బాలీవుడ్ భామ దీపికా ప‌దుకొణే న‌టించాల‌ని భావిస్తున్నాని తెలిపింది. ఆమె చురుకైన బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌తో పాటు మంచి న‌టి. అందుకే నా పాత్ర‌లో దీపికాని చూడాల‌ని అనుకుంటున్నాను. ఇక తుది నిర్ణ‌యం మేక‌ర్స్‌దే అని సింధు పేర్కొంది. ప్ర‌స్తుతం దీపికా ప‌దుకొణే .. క‌పిల్ దేవ్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న 83 చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.