samantha akkineni reveals her love story సావిత్రి జీవితం గురించి తెలియని ఈ తరం ప్రజానీకానికి, ప్రేక్షకులకు ‘మహానటి’ సినిమా ద్వారా ఆమె జీవితంలో ఏం జరిగిందనే విషయం క్లుప్తంగా స్పష్టమైంది. ఉన్నతమైన స్థాయిలో ఉన్న సావిత్రి తాగుడుకు బానిస అవ్వడానికి, పతాక స్థాయి నుండి అధమ స్థాయికి పడిపోవడానికి గల కారణం తాను నమ్మిన ప్రేమేనని, జెమినీ గణేశన్ పై పెంచుకున్న ఆప్యాయతేనని ‘మహానటి’ సినిమా చెప్పింది.

అయితే తన జీవితం కూడా సావిత్రిలా మారిపోయేదని, తృటిలో తప్పిపోయిందని ‘మహానటి’లో మధురవాణి పాత్ర పోషించిన సమంత చెప్పుకొచ్చింది. సావిత్రి నమ్మినట్లే తాను కూడా ప్రేమ విషయంలో అలా నమ్మానని, అదృష్టం కొద్దీ తప్పించుకున్నానని, లేదంటే తన జీవితం కూడా సావిత్రిలా అయ్యుండేదని సంచలన విషయాలు చెప్పింది. ఆ బాధ నుండి తాను త్వరగానే కోలుకున్నానని, తన అదృష్టంగా చైతూ తనకు దొరికాడని తన అనుభూతులను ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది.

ఇంతకీ సమంత జీవితంలో వచ్చిన ‘జెమినీ గణేశన్’ ఎవరు? సమంత అంతలా నమ్మిన ఆ ‘జబర్దస్త్’ కుర్రాడు ఎవరు? అన్న విషయాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! ఏది ఏమైనా గతాన్ని మరిచిపోయి ప్రస్తుతం అక్కినేని వారింటి కోడలుగా సమంత జీవితం హాయిగా సాఫీగా సాగిపోతోంది. కోడలు రోల్ తో పాటు నటనలోనూ ఇంకా కొనసాగుతానని గర్వంగా చెప్పుకుంటోంది. దీనికి అక్కినేని, దగ్గుపాటి కుటుంబాలు తనపై చూపుతున్న ప్రేమే కారణమని తెలుపుతోంది.