samantha-akkineni-oh-baby-trailer-talkఅక్కినేని సమంత నటించిన ఓ బేబీ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ ను రెండు భాగాలుగా చూస్తే… మొదటి భాగంలో సమంత చలాకీగా చేసే అల్లరిని ఎక్కువగా హైలైట్ చేశారు. 70 ఏళ్ళ వృద్ధురాలు 25 ఏళ్ళ అమ్మాయిగా మారడం అనే కాన్సెప్ట్ వల్ల సమంత యాక్షన్ కొంచెం ఓవర్ గా అనిపించినా కథకు కావాల్సిందే అనుకోవాలి. ఇక రెండో భాగం వచ్చి కొన్ని ఎమోషనల్ సీన్స్ అలా అలా చూపిస్తూ ముగించేశారు. బహుశా అసలు కథ ఏంటో చెప్పకుండా ఉండే ప్రయత్నం కావొచ్చు.

దక్షిణ కొరియా బ్లాక్ బస్టర్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ అయిన ఈ సినిమాకు మహిళా దర్శకురాలు బీవీ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. డి.సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మాతలు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. లక్ష్మీ భూపాల్ మాటలు రాశారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. ట్రైలర్ లోని టెక్నికల్ అంశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. దీనితో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందనే చెప్పుకోవాలి.

ఆ ఎమోషనల్ పాయింట్ ఏంటి అనే దాని మీద సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ చిత్రం వచ్చే నెల ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్కినేని నాగచైతన్యను పెళ్లిచేసుకున్న తరవాత తన స్టైల్‌ను సమంత పూర్తిగా మార్చేసింది. ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘యూటర్న్’, ‘మజిలీ’ వంటి మంచి చిత్రాలు చేశారు. ఇప్పుడు ‘ఓ బేబీ’తో ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ చిత్రాన్ని విరివిగా ప్రమోట్ చేస్తుంది సమంత.