Samantha Akkineni Oh Baby Movie in Chinaఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓటమి తెలియని దర్శకుడు. బాహుబలి-2 తన సత్తా ఏంటో దేశవ్యాప్తంగా చాటాడు. ఇండియా బిజినెస్ లెక్కలోకి తీసుకుంటే బాహుబలి-2 అతిపెద్ద హిట్. బాలీవుడ్ సూపర్ స్టార్స్ చిత్రాలు కూడా బాహుబలి-2 తరువాతే. అయితే బాహుబలి సిరీస్ చిత్రాలు చైనాలో రిలీజ్ అయ్యి ఫెయిల్ అయ్యాయి. ఆ తరువాత తెలుగు సినిమాలు ఏవి చైనాలో రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు సమంత ఓ బేబీ అక్కడ విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

కొందరు డిస్ట్రిబ్యూటర్లతో దీని కోసం నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. చైనాలో వర్క్ అవుట్ ఐన భారతీయ చిత్రాలను పరిశీలిస్తే ఎక్కువగా ఎమోషనల్ చిత్రాలే కనిపిస్తాయి. ఓ బేబీ కూడా అదే కోవకి చెందినది కావడంతో సినిమా అక్కడ కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని చిత్రబృందం నమ్మకం. అయితే చైనా పరిమిత స్థాయిలోనే పరభాషా చిత్రాల విడుదలను అనుమతిస్తుంది అక్కడి ప్రభుత్వం దీనితో సినిమా విడుదలకు అక్కడ పెద్ద ప్రక్రియే ఉండబోతుంది. రాజమౌళి వల్ల కానిది సమంత వల్ల అవుతుందా?

మరోవైపు ఈ చిత్రాన్నహిందీలో రీమేక్ చేయాలని హీరో రానా దగ్గుబాటి భావిస్తున్నాడట. ఇక ఈ మూవీ టైటిల్ రోల్‌లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కనిపిస్తుందని సమాచారం. గతంలో ‘రాజీ’ అనే చిత్రం ద్వారా అలియా భట్ మంచి విజయాన్ని అందుకోవడమే కాదు.. తన నటనకు కూడా ప్రముఖుల నుంచి ప్రశంసలు అందాయి. కాబట్టి అలియా అయితేనే టైటిల్ రోల్ బాగా పండుతుందని రానా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.