ఒక్కసారిగా సమంత అభిమానులు ఉలిక్కిపడ్డారు... అంతట్లోనే కుదుటపడ్డారుసమంత అక్కినేని యొక్క డిజిటల్ డెబ్యూ, ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 గత నెలలో విడుదల కావాల్సి ఉంది, కానీ చివరి నిముషంలో వాయిదా పడింది. ఎటువంటి కారణం చెప్పకుండా ఓటీటీ దిగ్గజం, అమెజాన్ దానిని విడుదలను వాయిదా వేసింది. ఆ వెబ్ సిరీస్ ను సమ్మర్‌కు నెట్టివేసినట్లు దర్శకులు రాజ్‌, డికె ఆ తరువాత ప్రకటించారు.

అమెజాన్ యొక్క తాజా వెబ్ సిరీస్ తాండవ్ పెద్ద వివాదంలోనే ఇరుక్కుంది. సుప్రీం కోర్టు దాకా రచ్చ జరిగింది. దానితో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ని నిరవధికంగా ఆలస్యం చేస్తుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈరోజు అకస్మాత్తుగా, ఒక నేషనల్ న్యూస్ వెబ్‌సైట్‌లో మరిన్ని వివాదాలను నివారించడానికి అమెజాన్ ఈ ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకుందని వచ్చింది.

దీనితో సమంత, అలాగే ది ఫ్యామిలీ మాన్ 2 ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు. అయితే దర్శకులు మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆ న్యూస్ నివేదికను ఉటంకిస్తూ, ఇది బుల్ షిట్ అని వారు చెప్పారు. దానితో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2019 లో అత్యధికంగా వీక్షించబడిన అలాగే ఆరాధించబడిన వెబ్ సిరీస్‌లలో ఒకటి.

అమెజాన్ వెబ్ సిరీస్ కోసం మునుపెన్నడూ చూడని ప్రచార ప్రచారాన్ని ప్లాన్ చేస్తుందట. వెబ్ సిరీస్‌లో సమంత ఉగ్రవాదిగా కనిపిస్తుంది. మొన్న ఆ మధ్య విడుదల చేసిన టీజర్ లో ఆమెని ప్రముఖంగా చూపించారు. దాన్నిబట్టి ఆమె పాత్ర ఈ వెబ్ సిరీస్ కు కీలకం అని అర్ధం అవుతుంది.