Samantha Akkineniఆదిత్య 369, భైరవద్వీపం వంటి ఎన్నో వినూతనమైన సినిమాలకు దర్శకత్వం వహించారు సింగీతం శ్రీనివాస రావు. చివరిగా 2013లో వెల్కమ్ ఒబామా అనే సినిమాకు 80 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించారు. తాజాగా ఆయన 88 ఏళ్ల వయసులో ఇంకో సినిమా పట్టాలెక్కించడానికి సిద్ధం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.

88 ఏళ్ల వయసులో సింగీతం ఇప్పుడు మరో సినిమాకు డైరెక్ట్ చేయడం నిజంగా అద్భుతమే. స్వాతంత్య్రం ముందు కర్ణాటక కు చెందిన ఒక లెజండరీ సింగర్, నగరత్తమ్మ బయోపిక్ ను తెరకెక్కించే బాధ్యతను తీసుకున్నారు ఆయన. అది కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు నడుస్తున్నట్లు భోగట్టా.

ఈ సినిమా కోసం అనుష్కని హీరోయిన్ గా అనుకుంటున్నారట. అనుష్క దక్షిణాదిన అంతా ఫేమస్ హీరోయిన్. బాలీవుడ్ లో కూడా సుపరిచితమే. దీనితో ఆమె హీరోయిన్ అయితే బెటర్ అని అనుకుంటున్నారు. అయితే అనుష్క ఇప్పటివరకు దీని మీద ఒక నిర్ణయానికి రాలేకపోతుందని సమాచారం. ఈ వయసులో సింగీతం ఇంత పెద్ద సినిమా చెయ్యగలరా అనేది ఆమె అనుమానం అంటున్నారు.

ఇది ఇలా ఉండగా… ఒకవేళ అనుష్క కాదని అంటే ఈ పాత్రకు సమంతని సంప్రదించాలని అనుకుంటున్నారు నిర్మాతలు. సమంత ప్రస్తుతం ఒక తమిళ దర్శకుడితో ఒక ద్విభాషా చిత్రాన్ని ఒప్పుకుంది. మరోవైపు అనుష్క తన నిశ్శబ్దం విడుదల కోసం ఎదురు చూస్తుంది. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా రక్కసి కారణంగా వాయిదా పడింది.