Samantha Akkineni angry on personal questionsఈ మధ్య సమంత తుమ్మినా దగ్గినా ఆమె గర్భవతా అనే మాటలు తరచు వినిపిస్తున్నాయి. అవి తరచు వినీ వినీ ఆమె విసిగిపోయినట్టు ఉంది. తాజగా ఈ విషయంలో ఒక ఫ్యాన్ కు గట్టి సమాధానమే చెప్పింది. ఇటీవలే ఏఎన్ఆర్ అవార్డ్స్ వేడుకకు అక్కినేని కుటుంబమంతా హాజరైనా సమంత మాత్రం రాలేదు. దీనితో మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ తరుణంలో ఇంస్టాగ్రామ్ లో ఆమె తన ఫ్యాన్స్ తో మాట్లాడుతుండగా ఒక అతను మీ బాబు ఎప్పుడు జన్మిస్తాడు? అని ఓ ఫాలోవర్ ప్రశ్నించారు. అంతవరకు నవ్వుతూ ఉన్న సామ్ ఈ ప్రశ్నతో కోపం తెచ్చుకున్నారు. నేను తల్లి కావాలని ఎదురుచూస్తున్న వారికి ఇదే నా సమాధానం. 2022 ఆగస్టు 7న ఉదయం 7 గంటలకు నా బేబీ జన్మించబోతున్నాడు అని సీరియస్ గా అన్నారు.

పదే పదే ఇదే ప్రశ్న ఎదురుకావడంతో సమంత విసుగు చెంది అలా మాట్లాడినట్లు అర్థం అవుతోంది. ఈ మధ్య కాలంలో నెటిజన్లు కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రా విషయంలోనూ ఇలానే జరుగుతోంది.

మా వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించండి అంటూ వారు అభిమానులకు పదే పదే గుర్తు చెయ్యాల్సి వస్తుంది. ఇక సమంత విషయానికి వస్తే లండన్ లో ది ఫ్యామిలీ మాన్ షూటింగ్ నుండి ఆమె ఏఎన్ఆర్ అవార్డ్స్ కు రావాలని ప్రయత్నించినా విమానం ఆలస్యం కావడంతో కుదరలేదట. దీనితో ఆమె ఆ ఈవెంట్ కు మిస్ కొట్టారు.