Samantha Akkineni Amala, Samantha Akkineni Amala Photo, Samantha Akkineni Amala   Naga Chaitanya, Samantha Akkineni Amala Photo Viral, Samantha Amala Meetగత కొంతకాలంగా నాగచైతన్య – సమంత ఫోటోలు సోషల్ మీడియాలో ఒక ప్రభంజనానికి కారణమయ్యాయి. ఒక రకంగా వీరిద్దరి జంటకు పేరు తెచ్చింది కూడా ఆ ఫోటోలే. కాఫీ డే నుండి షాపింగ్ మాల్స్ వరకు అనేక ఫోటోలు చక్కర్లు కొట్టిన పిదప, ఇటీవల ఆ ఉధృతి తగ్గుముఖం పట్టింది. మరో వైపు సోషల్ మీడియాలో కూడా తన మాటలను చాలా పొదుపుగా వాడుతోంది సమంత. దీనికి తోడు అక్కినేని నాగార్జునే సమంతను సచిన్ వంటి పలువురి ప్రముఖులకు కాబోయే కోడలుగా పరిచయం చేయడం వంటి సంఘటనలు, దాదాపు అధికారికంగానే వీరి వివాహాన్ని ఖరారు చేసాయి.

ఇలాంటి సమయంలో తాజాగా ఓ సమంత ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అయితే ఈ సారి నాగచైతన్యతో కాదు… అక్కినేని అమలతో..! ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఈ ఫోటోకు ‘అక్కినేని వారి కోడలు’ వంటి ట్యాగ్ లైన్స్ తో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్ళికి ముందు టిప్స్ తీసుకోవడానికి వచ్చిన స్టూడెంట్ లా బుక్స్ చేత పట్టుకుని ఉన్న సమంతకు అమల సూచనలు చేస్తున్నట్లుగా ఉంది ఈ ఫోటో. ఏమో… అదే నిజమేమో… ఎందుకంటే… సమంత మాదిరే అమల కూడా హీరోయిన్ గా కొనసాగుతూ నాగ్ ను వివాహమాడిన విషయం తెలిసిందే.