Nithin Samanthaప్రస్తుతం సినీ, రాజకీయాలను ‘చెప్పు’ అన్న పదం బాగా ప్రభావితం చేస్తోంది. ఇటీవల ఓ షోలో పాల్గొని ‘అ… ఆ…’ సినిమా ప్రమోషన్స్ ఇస్తున్న సమయంలో… సమంతను ‘ఓవర్సీస్ క్వీన్’గా అభివర్ణించిన యాంకర్, ఈ సినిమాతో 1 మిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాలు పదవుతాయని ప్రశంసలతో ముంచెత్తగా… దీనిపై సమంత మాత్రం ఏ ‘క్రెడిట్’ తీసుకోకపోవడం విశేషం.

“తొమ్మిది సినిమాలు నా వల్ల మిలియన్ డాలర్లు వసూలు చేసాయని అంటే ‘చెప్పుతో కొడతారు…’ ఏదో ఆ సినిమాలలో నేను కూడా ఒక భాగస్వామి కావడం… అలా జరిగిపోయాయి అంతే..! అయితే ఈ సినిమాతో కలిపి 10 పూర్తయితే ఇంకా హ్యాపీ” అంటూ తన వినయ భావాలను బహిర్గతపరిచింది. ఓ పక్క నుండి నితిన్ ‘నైన్ మిలియన్ డాలర్ల బేబీ’ అంటూ వ్యాఖ్యానిస్తున్న సమయంలో సమంత ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

ఏదో నితిన్ దయ వలన ఈ సినిమా కూడా 1 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే బాగుంటుందని అని సమంత చెప్పగా… నా దయ కాదు… త్రివిక్రమ్ గారి దయ… అంటూ వెంటనే నితిన్ కౌంటర్ వేసేసాడు. ఏ చిన్న అవకాశం దొరికినా… ఆ సినిమా సక్సెస్ నా వల్లే అయ్యింది… అంటూ సహజంగా చెప్పుకుని తిరిగే సినీ జనాల ఆలోచనలు రానూ రానూ మారుతున్నట్లుగా కనపడుతోంది.