Samanatha Akkineni Responds on Pregnancy rumoursసమంత, నాగ చైతన్య వివాహం జరిగి సంవత్సరన్నర కాలం దాటిపోయింది. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలో సమంత తాజా చిత్రం ‘ఓ బేబీ’ ప్రమోషన్స్ మొదలైన తర్వాత ఆసక్తికర చర్చ మొదలైంది. ‘ సామ్ ఇప్పటికే గర్భం దాల్చిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ట్విట్టర్లో కూడా సమంత తన పేరును ‘బేబీ అక్కినేని’గా మార్చేశారు. దీని వెనక త్వరలో తాను ఓ బేబీని కనబోతున్న మీనింగ్ కూడా వస్తుందనే కొందరు అంటున్నారు.

అలాగే ఈ చిత్ర టీజర్ సందర్భంగా నాగచైతన్య సమంతను బేబీ అని సంబోదించడంతో ఈ పుకార్లు మరింత పెరిగాయి. అయితే వీటిపై సమంత ఒకింత వ్యంగంగా స్పందించింది. దీనికి సంబందించిన ఒక న్యూస్ ని కోట్ చేస్తూ అయ్యో అవునా? మీకు తెలిసినప్పుడు మాకు కూడా కాస్త చెప్పండి అంటూ వెటకారమాడింది. దీనితో ఈ వార్తలలో నిజం లేదని తేలినట్టు అయ్యింది. సమంత ఓ బేబీ చిత్రం వచ్చే నెల ఐదున విడుదల కాబోతుంది. ఆమె 96 రీమేక్ లో కూడా నటిస్తుంది.

ఇది ఇలా ఉండగా గతంలో ప్రెగ్నన్సీ గురించి సమంత వ్యాఖ్యానించింది. తనకు పిల్లలంటే చాలా ఇష్టమైని, అమ్మతనాన్ని ఆస్వాదించాలనే కోరికగా ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంత వెల్లడించారు. ‘రేపు నాకు పుట్టబోయే బిడ్డలు…. నాన్న పెద్ద స్టార్, మరి నువ్వు ఏమిటని అడగితే వాళ్లకు నేను గెలుచుకున్న అవార్డులు చూపిస్తాను. నటిగా అవార్డులు తీసుకునే స్థాయికి వచ్చినందుకు సంతోషంగా ఫీలవుతున్నాను’ తెలిపారు. తాను గర్భం దాల్చిన వెంటనే సినిమాలు మానేసి పూర్తి సమయం వారి సంరక్షణకే కేటాయిస్తా అని చెప్పింది.