Sam Billings helps Chennai Super Kings beat Kolkata Knight Ridersఈ సీజన్ ఐపీఎల్ లో ఇప్పటివరకు అయిదు మ్యాచ్ లు ముగిసాయి. జరిగిన అయిదు మ్యాచ్ లలోనూ రెండవ సారి బ్యాటింగ్ చేసిన జట్టే విజయాలు సాధించాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకోవడం, ప్రత్యర్ధి ఇచ్చిన లక్ష్యాన్ని చేధించడం అనేది పరిపాటిగా మారింది. తాజాగా మంగళవారం జరిగిన మ్యాచ్ లోనూ చెన్నై ఇదే ఫీట్ ను రిపీట్ చేసింది.

రెండేళ్ళ తర్వాత ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మరో థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. మొదటి మ్యాచ్ లో ముంబైపై అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్న చెన్నై, తాజాగా కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లోనూ భారీ స్కోర్ ను చేధించి, వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది.

తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా 202 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. ఒక దశలో 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన నైట్ రైడర్స్ ను ఆల్ రౌండర్ రస్సెల్ (36 బంతుల్లో 11 సిక్సర్లతో 88 పరుగుల)తో వీరవిహారం చేసాడు. భారీ లక్ష్యాన్ని చెన్నై గ్రాండ్ గా ఆరంభించి తొలి 5.5 ఓవర్లలోనే 75 పరుగులు నమోదు చేసాడు.

తొలి వికెట్ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన చెన్నై, ఒక దశలో మ్యాచ్ కోల్ కతా పరం చేసినంత పని చేసింది. ముఖ్యంగా భారీ షాట్లతో కొట్టడంలో ధోని విఫలం అవ్వడం అభిమానులకు నిరుత్సాహపరిచిన అంశం. ఈ తరుణంలో శ్యాం బిల్లింగ్స్ 23 బంతుల్లో 56 పరుగులు చేయగా, మిగిలిన తంతును జడేజా, బ్రావోలు ముగించారు.