salute to vikram abhinandhan Vardhamanపాకిస్థాన్‌లో భారత్‌కు చెందిన మిగ్‌ 21 బైసన్‌ యుద్ధవిమానం కూలినట్లు భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ ధ్రువీకరించారు. పైలట్‌ ఒకరు గల్లంతయ్యారని వివరించారు. అతడు తమ అదుపులో ఉన్నట్లు పాక్‌ చెబుతోందన్నారు. మరో వైపు పైలట్‌ అభినందన్‌ కు పాకిస్తాన్ చెరలో ఉన్నట్టుగా తెలిపే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని మొత్తం దేశమంతా ప్రార్థిస్తుంది. ఆయనను అక్కడ టార్చర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే జెనీవా కన్వెన్షన్ ప్రకారం ఏదైనా ఒక దేశానికీ చెందిన సైనికుడు పొరుగు దేశంలో పట్టుబడితే ఆయన గౌరవానికి ఎటువంటి భంగం కలిగించకూడదు. పట్టుబడిన వారం లోగా ఆయనను ఆ దేశానికీ అప్పగించాలి. ఒకవేళ అప్పగించకపోతే ఆ దేశం యుద్దానికి వెళ్ళినట్టే. అంతర్జాతీయంగా అట్టి దేశంపై యాక్షన్ ఉంటుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఏం చెయ్యబోతుంది అనేది చూడాలి. సైనికుడికోసం భారత్ ఏ విధంగా ఒత్తిడి చేస్తుంది అనేది కూడా చూడాలి.

మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఒక్కసారి యుద్ధమంటూ మొదలైతే అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. ఒక్కసారి యుద్ధం మొదలైతే తన చేతుల్లో గానీ, భారత ప్రధాని మోదీ చేతుల్లో గానీ ఉండదని వ్యాఖ్యానించారు. ఎప్పటిలానే పూల్వమా దాడిపై భారత్ ఎటువంటి సాక్షాలు ఇవ్వలేదని చేతులు దులుపుకున్నారు. ‘మా భూభాగంలోకి మీరు వచ్చారు.. మీ భూభాగంలోకి మేం వచ్చాం’’ అని భారత వాయుసేన దాడి, అందుకు పాక్‌ ఇవాళ చేపట్టిన దాడులను సమర్ధించారు.