Salman khan statement at jodhpur courtకృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రాజస్థాన్ లోని జోధ్ పూర్ కోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా కోర్టులో విచారణకు ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా సల్మాన్ స్పందిస్తూ, తాను హిందువునని, ముస్లింనని, ఓ భారతీయుడినని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తొలుత హిందీలో సమాధానం చెప్పిన సల్మాన్… ఆ తర్వాత ఇంగ్లీషులో కూడా చెప్పాడు.

మరోవైపు తనపై తప్పుడు అభియోగాలు మోపారని, తప్పుడు కేసు పెట్టారని కోర్టుకు తెలిపాడు. మొత్తం ఇలా 65 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తన సహనటుల సమక్షంలోనే సల్మాన్ సాక్ష్యాన్ని నమోదు చేశారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో, సల్మాన్ ఖాన్ రెండు జింకలను చంపాడనే ఆరోపణలతో… 1998లో ఆయనపై కేసు నమోదైంది.